![]() |
![]() |

బుల్లితెర మీద యాంకర్ రవి గురించి తెలియని వాళ్ళు ఉండరు.. మేల్ యాంకర్స్ లో రవి ఫుల్ ఫేమస్. రవి షోస్, ఇంటర్వ్యూస్, అప్పుడప్పుడు మూవీస్ అవీ చేస్తూ ఉంటాడు. ఎప్పుడూ సోషల్ మీడియాలో అప్ డేట్ గా ఉంటాడు. తన లేటెస్ట్ అండ్ కమింగ్ అప్ డేట్స్ ని కూడా ఫాన్స్ తో షేర్ చేస్తుంటాడు. అలాంటి రవి ఇప్పుడు తన వైఫ్ నిత్యా, కూతురు వియ, అలాగే నిత్యా వాళ్ళ పేరెంట్స్ తో కలిసి ఒక ప్లేస్ కి వెళ్ళాడు. "కార్డేలియా క్రూజ్" లో తన ఫ్యామిలీతో కలిసి చెన్నై నుంచి శ్రీలంకపై వెళ్ళాడు. ఫస్ట్ టైం క్రూజ్ లో వెళ్తున్నామని చెప్పాడు. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లి అక్కడినుంచి క్రూజ్ లో వెళ్లారు రవి అండ్ ఫ్యామిలీ.
అలాగే తన ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుని క్రూజ్ టాప్ లోకి అంటే టెన్త్ ఫ్లోర్ లోకి వెళ్ళాడు. అక్కడ సముద్రపు గాలి హోరెత్తించింది. ఇక రవి, నిత్యా ఇద్దరూ కలిసి టైటానిక్ పోజ్ ఒకటి పెట్టారు. ఎక్సపెక్ట్షన్స్ పెట్టుకుని రాలేదు ..కానీ సూపర్ గా ఉంది..ఫుడ్ సూపర్ సూపర్ గా ఉంది. యాక్టువల్ గా ఇండియన్ ఓషన్ లో ఉన్నామన్నారు రవి. కార్డేలియా బ్రిడ్జి టూర్ కూడా చేశారు వీళ్లంతా. ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఛాన్స్ వస్తే వస్తే మాత్రం కార్డేలియా క్రూజ్ లో ట్రావెల్ చేయండి. చాలా అమేజింగ్ గా ఉంటుంది. అలాగే ఈ క్రూజ్ ఓనర్ లైఫ్ చాలా ఇన్స్పిరేషనల్ కూడా. అలా మూడో రోజు శ్రీలంకకి వెళ్లారు. అక్కడ "ఏల నేషనల్ పార్క్" కి వెళ్లారు. తర్వాత నాలుగో రోజు త్రికోణమాలి అనే బీచ్ వెళ్లి అక్కడ ఎంజాయ్ చేశారు. క్రూజ్ అంటే చిన్న సైజు సిటీ లాంటిది. ఇక్కడ ప్రతీ రోజూ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఇలా ఒక ఫైవ్ డేస్ క్రూజ్ లో ఎంజాయ్ చేసి ఆ హ్యాపీనెస్ ని తన వ్లాగ్ లో షేర్ చేసుకున్నాడు రవి. డబ్బుని చక్కగా ఖర్చుపెట్టాలి కానీ ఎక్కువగా సేవ్ చేయక్కర్లేదు. డబ్బు సంపాదించేది హ్యాపీగా ఉండడానికే కదా అని చెప్పాడు రవి.
![]() |
![]() |